Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:13 PM

తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం.. తొలి ఆరు నెలలు తల్లిపాలే శ్రేష్ఠమైన ఆహారం

05-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితాదేవి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి హాజరై చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. జననం నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ కాలంలో నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని సూచించారు. తల్లిపాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడటమే కాకుండా తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని వివరించారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి బాలింతలను ప్రోత్సహించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలే బలమైన పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. శశాంక్, సర్పంచ్ హరిప్రసాద్, సీడీపీఓ చంద్రకళ, యూనిసెఫ్ ప్రతినిధి సౌమ్య, సూపర్‌వైజర్లు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం.. తొలి ఆరు నెలలు తల్లిపాలే శ్రేష్ఠమైన ఆహారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News