Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాదుల విధుల బహిష్కరణ
05-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

న్యాయవాది మల్లయ్య హత్యను నిరసిస్తూ చౌటుప్పల్ కోర్టు ఎదుట ధర్నా

న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను నిరసిస్తూ చౌటుప్పల్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మంగళవారం చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు భవనం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.​ఈ సందర్భంగా చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. కల్వకుర్తి కోర్టు న్యాయవాది మల్లయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కోరారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై వరుసగా దాడులు జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి మక్తల నరసింహా, కార్యవర్గ సభ్యులు ఎండి ఖయ్యూం పాషా, పిల్లలమర్రి కిరణ్, మాజీ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి, తడక మోహన్, రాపోలు వేణు, జల్ల రమేష్, జక్కార్థి శేఖర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News