Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

ఐఐటీ విద్యార్థికి 'ఎన్‌ఎల్‌ఎన్' & 'బెస్ట్ రన్నర్స్' ఫౌండేషన్ల చేయూత

05-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భిలాయ్/హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ప్రతిభావంతుడైన నిరుపేద విద్యార్థికి 'నాతి లక్ష్మి నర్సింహా (NLN) ఫౌండేషన్' మరియు 'బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్'లు అండగా నిలిచాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆ విద్యార్థి భవిష్యత్తుకు ఆర్థిక సహాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి.

ఐఐటీ (IIT) భిలాయ్‌లో చదువుతున్న రాపర్తి అభిలాష్ అనే విద్యార్థి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువును కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఈ ఫౌండేషన్లు తక్షణమే స్పందించాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నాతి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవతో విద్యార్థి ఉన్నత విద్య కోసం రూ. 86,000/- ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ సహాయాన్ని KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, నాతి గణేష్ మరియు రాజేష్ KGKS ల చేతుల మీదుగా విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ — "విద్యతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని మేము దృఢంగా నమ్ముతున్నాము. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారి చదువుకు ఆసరాగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నాము. సదా విద్యార్థుల సేవలో మా ఫౌండేషన్ ముందుంటుంది" అని తెలిపారు.

సామాజిక బాధ్యతతో విద్యార్థి చదువుకు ఆసరాగా నిలిచిన నాతి లక్ష్మి నర్సింహ ఫౌండేషన్ మరియు బెస్ట్ రన్నర్స్ ఫౌండేషన్ సేవా దృక్పథాన్ని పలువురు కొనియాడారు.

సంప్రదించాల్సిన వివరాలు: నాతి లక్ష్మి నర్సింహ ఫౌండేషన్

గణేష్ నాతి: 9988801363

Sthanikam

ఐఐటీ విద్యార్థికి 'ఎన్‌ఎల్‌ఎన్' & 'బెస్ట్ రన్నర్స్' ఫౌండేషన్ల చేయూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News