ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, కులమత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు నిదర్శనమని అన్నారు. సాహిత్య, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ పూలను పూజించడం ద్వారా ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం బతుకమ్మలో ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రత్నమంజుల, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీనీలిమ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జె. చిన్నబాబు, జి. సునీత, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ ఎం. అనిత, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి