Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:10 PM

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
09-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, కులమత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు నిదర్శనమని అన్నారు. సాహిత్య, సాంస్కృతిక విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ పూలను పూజించడం ద్వారా ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం బతుకమ్మలో ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ జె. చిన్నబాబు, జి. సునీత, మహిళా సాధికారత విభాగం కన్వీనర్‌ ఎం. అనిత, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News