Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:12 PM

ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన

09-10-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు శాఖ సంయుక్తంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందించనున్న ఉచిత శిక్షణలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపు (అక్టోబర్ 10, శనివారం) ఉదయం 10 గంటలకు ప్రాథమిక ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత జాబితాలో సరిచూసుకుని, తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని సూచించారు.సంగారెడ్డి కేంద్రంగా శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్‌లో, అందోల్ కేంద్రంగా జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జహీరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షకు హాజరుకావాలి.పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఆధార్ కార్డుతో పాటు ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ప్రాథమిక దరఖాస్తు పత్రాన్ని (TGPLRB Application Form) తప్పనిసరిగా తీసుకురావాలి. ఉదయం 10 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ముందుగానే రావాలని ఎస్పీ సూచించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని, ఇతర జిల్లాల అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఈ సూచనలు పాటించి, ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కోరారు.

Sthanikam

ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News