నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసే గొప్ప పండుగ బతుకమ్మ అని తెలిపారు. పూర్వకాలం నుంచి తంగేడు తదితర పూలు, ఆకులతో బతుకమ్మను అందంగా అలంకరించి, మధ్యలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి పూజించడం మన సంప్రదాయమని వివరించారు.బతుకమ్మ పాటలు పాడుతూ కుటుంబ సభ్యులు, సమాజం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ పాల్గొని, అందంగా బతుకమ్మలను తయారు చేసి తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషకులు, శ్రేయోభిలాషులకు బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి