Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:06 PM

శోభనాద్రిపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శోభనాద్రిపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శోభనాద్రిపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
09-10-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

65 మంది మహిళలతో ఆటపాటలు.. విజేతలకు బహుమతులు

శోభనాద్రిపురం: గ్రామంలోని ఎంపీయూపీఎస్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన 65 మంది మహిళలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. రోజువారీ పనుల ఒత్తిడిని మరిచి మూడు గంటలపాటు ఉత్సాహంగా గడిపారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడంతోపాటు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పోటీల్లో విజేతలకు గ్రామ సర్పంచ్‌ కంచి మధుసూదన్‌ ఇత్తడి పూజా దీపాలను బహుమతులుగా అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి జీవించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ విజయానికి సహకరించిన మహిళలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

శోభనాద్రిపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News