వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి!.
రామన్నపేట అక్టోబర్ 9 స్థానికం ప్రతినిధి :
వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందించాలని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రామన్నపేట పట్టణంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఫోరం సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిగా చిన్నపాక రమేష్‌ను నియమించారు.ఈ సందర్భంగా గనగాని రమేష్ మాట్లాడుతూ వార్డు సభ్యులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. వార్డు సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు.
వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతోపాటు వారి హక్కుల సాధనకు ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి