భువనగిరి, అక్టోబర్ 9:భువనగిరి మండలంలోని జెనేసిస్ వ్యాలీ, గౌతమ్ మోడల్ హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మిర్యాల దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి