Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:26 PM

కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

09-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తల్లుల ఆటపాటలతో సందడి.. ఇద్దరికి చీరల బహూకరణ.

రామన్నపేట అక్టోబర్ 9 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండలంలోని కక్కిరేణి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బి. ఉపేందర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతోపాటు పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమన్నారు. జేపీ మీడియా సహకారంతో నిర్వహించిన లక్కీ డ్రాలో ఇద్దరు విద్యార్థుల తల్లులకు చీరలు అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్‌ చిల్ల మధురవేణి సురేష్‌, ఏఏపీసీ చైర్మన్‌ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, ఉపసర్పంచ్‌ నడిగోటి పాండు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News