అకాల మరణం చెందిన మిత్రుడి కుటుంబానికి చేయూత
ఆర్థిక సాయం అందజేసిన 2010-11 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు
'కష్టంలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు' అని నిరూపించారు చౌటుప్పల్ పట్టణం మల్లికార్జున హై స్కూల్ 2010-11 పదో తరగతి పూర్వ విద్యార్థులు. ఇటీవల అనారోగ్య సమస్యలతో అకస్మాత్తుగా మృతి చెందిన తమ ప్రియమైన మిత్రుడు కోకు నవీన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులంతా చేయి చేయి కలిపారు. నవీన్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో అందరూ కలిసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. అనంతరం నవీన్ నివాసానికి వెళ్లి ఆయన తల్లిని పరామర్శించి, సేకరించిన ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన పూర్వ విద్యార్థుల ఆదర్శ భావాలను స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి