మద్య నిషేధం, ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ చంద్రయ్య ఆదేశాల మేరకు, సహాయ కమిషనర్ గాయత్రీ సూచనలతో సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇథనాల్ అక్రమ రవాణా, నిల్వలపై దాడులు నిర్వహించారు. కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్-3, మార్కుక్ మండలం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇథనాల్ తరలిస్తున్న బజాజ్ ఆటోను గుర్తించి సుమారు 500 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయలోని ఓ ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించగా, మరో 800 లీటర్ల ఇథనాల్ అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1,300 లీటర్ల ఇథనాల్, ఒక బజాజ్ మ్యాక్సిమా వాహనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న షయాంలాల్ బిషనోయ్ కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇథనాల్‌ను వివిధ ఔషధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సురేష్ బాబు, గొట్టుముక్కల వెంకటరామరాజు, ఇస్లావత్ రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా ఇథనాల్ రవాణా, నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అనుమతులు లేకుండా ఇథనాల్ తరలింపు.. ముగ్గురు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి