భువనగిరి, అక్టోబర్ 9: భువనగిరి పట్టణంలోని ఆర్‌బీ నగర్ దేదీప్య హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ టి. శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపాల్ రూప, డైరెక్టర్లు రంగారావు, రమ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల గౌరవం, ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి