నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి పంటకు నష్టం కలగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ సూచించారు. ప్రస్తుతం పత్తి పంట సుమారు 100 రోజుల దశలో ఉండి కాయలు అభివృద్ధి చెందుతున్నాయని, వర్షాలు లేక నేలలో తేమ తగ్గిపోవడంతో మొక్కలు ఎండిపోవడం, కాయలు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎద్దడి నుంచి పంటను కొంతవరకు కాపాడేందుకు లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) కలిపి పత్తి ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు.అయితే, ఈ పిచికారీ ఒక్కటే సమస్యకు పూర్తి పరిష్కారం కాదని, పంట పరిస్థితులను బట్టి ఇతర యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట సంరక్షణ చర్యలు చేపట్టి నష్టాన్ని తగ్గించుకోవాలని సంతోష్ రైతులకు సూచించారు.
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి