కోలాటాలు, విద్యార్థినుల ఆటపాటలతో సందడిగా మారిన పాఠశాల ప్రాంగణం
స్థానిక విశాల భారతి హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు శుక్రవారం అత్యంత వైభవంగా,కన్నులపండువగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పాఠశాల ప్రాంగణమంతా వర్ణశోభితమైన పూలతో, విద్యార్థినుల సంప్రదాయ దుస్తులతో పండగ వాతావరణం సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ప్రదర్శించిన కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమని కొనియాడారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంప్రదాయం కేవలం మన తెలంగాణలోనే ఉందన్నారు. మన మహోన్నతమైన సంస్కృతీ సంప్రదాయాలను, పండుగ విశిష్టతను భావితరాలకు సగర్వంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం శ్రీనివాసు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి