Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:04 PM

ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు

09-10-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పూల పరిమళాలు.. విద్యార్థినుల ఆటపాటలతో సందడిగా మారిన పాఠశాల ప్రాంగణం

​వైభవంగా సాగిన దాండియా, సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకయైన బతుకమ్మ పండుగ వేడుకలు చౌటుప్పల్‌లోని ఐరా గ్లోబల్ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం అత్యంత వైభవంగా,కన్నులపండువగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రాంగణమంతా పండగ శోభ సంతరించుకుంది.రంగురంగుల రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు ఆడుతూ పాడుతూ చేసిన నృత్యాలు, దాండియా ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్, కరస్పాండంట్ అరుణ శ్రీకాంత్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిని, ఆడపడుచులను గౌరవించే గొప్ప పండుగని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు మన పూర్వీకుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, ఇలాంటి వేడుకలు వారిలో ఐక్యతను, సోదరభావాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ​పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తమ పాఠశాలలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఆధునిక విద్యను అభ్యసిస్తూనే, మన ప్రాచీన సంస్కృతికి రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు.​ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News