Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’
05-08-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ.1.50 లక్షల ఎల్‌వోసీ చెక్కు అందజేసిన సర్పంచ్‌ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతగానో తోడ్పడుతుందని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన సిలివేరు పద్మమ్మ తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ (LOC) చెక్కును మంజూరు చేయించారు. ​ఉపశమనం పొందిన ఈ చెక్కును బుధవారం సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో రామాలయ చైర్మన్ పన్నాల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, రాసాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News