Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:50 PM

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం

05-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురువాయుగుండం గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని గురువాయుగుండం గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం పిలుపునిచ్చారు. బుధవారం గురువాయుగుండం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ, వాటిని నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సర్పంచ్ బానోత్ బిక్షం కోరారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలంతా మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బానోత్ సతీష్, దుర్గారావు, పద్మ, నాగిరెడ్డి ఉమా, లీల, శారద, రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News