Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:48 PM

ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

05-08-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు, లైబ్రరీ ఇన్‌చార్జి పి. స్రవంతి, అధ్యాపకుడు విజయ్‌కుమార్ విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి. వీరభద్రరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్‌బుక్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై విద్యా వ్యయ భారం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అందించిన నోట్‌బుక్స్‌ను సక్రమంగా వినియోగించి విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తామని తెలిపారు.

Sthanikam

ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News