Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ కాశిరెడ్డి .

05-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

‘సైబర్ జాగూరుకత’ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురం పరిధిలో "సైబర్ జాగూరుకత" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఉదయం ఇంజాపూర్ సంజీవని వనం పార్క్, ఎన్‌జీఓస్ కాలనీలోని వివేకానంద పార్క్, ఆటోనగర్ డీర్ పార్క్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక సదస్సు నిర్వహించి సైబర్ నేరాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివశంకర్, వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ రవిబాబు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, ఎస్‌ఐలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ కాశిరెడ్డి .

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News