Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్

05-08-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జేబీఎం కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు. ‘సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ నగర్ జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సురక్షిత రహదారి – సురక్షిత జీవితం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణాన్ని సాగించవచ్చని సూచించారు.​అనంతరం పీసీ మమత సైబర్ నేరాల గురించి వివరిస్తూ.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించవద్దని స్పష్టం చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్ నిర్మల, అధ్యాపకులు మాధవి, రంజిత్, యువరాజు, స్వాతి, మమత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News