Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉద్యమకారుల ఫోరం

05-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలి: డా. చీమ శ్రీనివాసరావు

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఉద్యమకారుల ఫోరం నాయకులు బుధవారం పరామర్శించారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా. చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన గొప్ప నాయకుడిని కోల్పోయామని, ఆయన మరణం ఉద్యమకారులకు తీరని లోటని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తీవ్ర గాయాలపాలై ఒక కన్ను కోల్పోయినా ఉద్యమాన్ని వీడకుండా రాష్ట్ర సాధన కోసం చివరి వరకు పోరాడిన యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి ఉద్యమకారుల ఫోరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గుండు దయానంద్, మహిళా ఉపాధ్యక్షురాలు దుగ్యాని శ్యామల, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ జగన్, సీనియర్ నాయకులు కొండ స్వామి, భాస్కర్, రజనీకాంత్, జయ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఉద్యమకారుల ఫోరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News