Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

05-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తూర్పుపల్లిలో 20–30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. సూత్రధారుల వేట ప్రారంభం.

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమ రవాణా వెలుగుచూసింది.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను త్వరలోనే రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Sthanikam

అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News