Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు

09-08-2026 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో మైనారిటీ వర్గాల కోసం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 10 గుంటల స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పత్రాలు, నిధుల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో మైనారిటీ వర్గాల ప్రతినిధులకు అందజేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయితే మైనారిటీ వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని ప్రతినిధులు తెలిపారు. తమ అవసరాన్ని గుర్తించి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే. రాజు, కే. శ్రీనివాసరెడ్డి, పి. మనోజ్ పటేల్, గఫార్ సాబ్, పాషుమియా, జానీ సాబ్, మైతాబ్ అలీ, ఇస్మాయిల్ సాబ్, గౌసొద్దీన్, హాజీ మైనుద్దీన్, మహమ్మద్ సాబ్, మోయిన్, బోలెసాబ్, షేక్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News