కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కౌన్సిలర్లు తన్వీర్ హుస్సేన్, బానోత్ సైదులు సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ శంకర కంటి ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్నపాటి సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షలతో తీవ్రమైన కంటి సమస్యలను నివారించవచ్చన్నారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
42 మందికి శస్త్రచికిత్స అవసరం
శిబిరంలో మొత్తం 220 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 42 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించినట్లు అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాసు తెలిపారు. వీరిని సోమవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ యాస రాంకుమార్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మందడి రమాదేవి, వైద్యులు నుమాన్, అనిల్, ఫౌండేషన్ సభ్యులు బత్తుల దామోదర్‌రెడ్డి, నరాల తిరుమలరెడ్డి, షేక్ నజీర్‌పాషా, గడ్డం వీరబాబు, క్యాంపు ఇన్‌చార్జి నాయిని స్టాలిన్, రమేష్, అక్షయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి