Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలుకు తపస్‌ పోరాటం: జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

09-08-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్‌లోని శిశుమందిర్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) నారాయణఖేడ్ డివిజన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దత్తాత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడి వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటైన సీపీఎస్‌ రద్దును ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే టీపీయూఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంజీరా పరివాహక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటివరకు సుమారు 20 వేల మొక్కలను స్వయంగా నాటి, ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపునకు కృషి చేస్తున్న స్థానిక పర్యావరణ కార్యకర్త జ్ఞానేశ్వర్‌ను టీపీయూఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవా కో-కన్వీనర్ చంద్రశేఖర్ ఆచార్య, జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్, జిల్లా బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్‌తో పాటు రతన్ సింగ్, మచ్చందర్, మహేశ్, పద్మనాభం, రాజు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలుకు తపస్‌ పోరాటం: జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News