Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన!

30-07-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠశాల దశ నుంచే పెంపొందించుకోవాలి

చిన్నకొండూరు పాఠశాలలో ఏఐ , ఏం ఎల్ , సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక సదస్సు

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థులు పాఠశాల దశ నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, మందోళ్ల గూడెం ఉపసర్పంచ్ డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిన్నకొండూర్ ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు "కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఏంఎల్), సైబర్ భద్రత" అనే అంశాలపై శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నాగోల్) సౌజన్యంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ​ఈ సందర్భంగా శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వివరిస్తూ, డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు సులభశైలిలో అర్థమయ్యేలా వివరించారు. అనునిత్యం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.

​విద్యార్థుల్లో సాంకేతిక విద్యపై ఆసక్తిని పెంపొందింపజేసి, నూతన ఆవిష్కరణల వైపు ఆలోచించేలా ప్రేరణనిచ్చిన శ్రీధర్ రెడ్డి, శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి విజ్ఞానవంతమైన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News