Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

బతుకమ్మ చీరలపై చురకలు.. పోలీసుల తీరుపైనా చిరుమర్తి ఫైర్

29-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పాటు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ఏడాది పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలను ఏడాది ఆలస్యంగా పంపిణీ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలకు అందజేస్తున్న చీరల్లో నాణ్యత లోపించిందని, ఒకే నమూనాలో ఉండటంతో అవి యూనిఫాంలా కనిపిస్తున్నాయని మహిళలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని పోలీసు అధికారుల పనితీరుపైనా చిరుమర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐలు, ఎస్ఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

పోలీసులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించిన ఆయన, లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజలతో మాట్లాడే భాష, ఉపయోగిస్తున్న పదజాలాన్ని వెంటనే మార్చుకోవాలని సూచిస్తూ, రాష్ట్ర డీజీపీ కూడా నకిరేకల్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బతుకమ్మ చీరలపై చురకలు.. పోలీసుల తీరుపైనా చిరుమర్తి ఫైర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News