Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

29-07-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రైతుల శ్రేయస్సు, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

గ్రామంలోని శ్రీ నాభిశిల బొడ్రాయి వద్ద సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుంచి బిందెడు నీరు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు తీసుకువచ్చి నాభిశిల బొడ్రాయికి జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి రైతుల సంక్షేమం, గ్రామాభివృద్ధి, సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

రైతు శ్రేయస్సు కోసం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News