Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 07:37 PM

స్త్రీ నిధిలో లక్షల అక్రమాలు.. తాటతీసిన జిల్లా కలెక్టర్

స్త్రీ నిధిలో లక్షల అక్రమాలు.. తాటతీసిన జిల్లా కలెక్టర్

స్త్రీ నిధిలో లక్షల అక్రమాలు.. తాటతీసిన జిల్లా కలెక్టర్
July 29, 2026 10:34 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SRI RAM NAGAR
గిరీష్ కుమార్

రూ. 14.54 లక్షలు అక్రమాలు..

విచారణలో వెలుగులోకి

వివోఏ తొలగింపు ..

ఆఫీస్ బేరర్లపైనా భర్తరఫ్ 

డీపీఎం బెనర్జీ పై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ ఆదేశం

సూర్యపేట :- మహిళా సంఘాల సభ్యులకు అండగా ఉండాల్సిన స్త్రీ నిధి నిధులు పక్కదారి పట్టాయి. సభ్యులు కష్టపడి కట్టిన వాయిదా డబ్బులను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ తన సొంతానికి వాడుకున్నాడు. ఈ భారీ అవకతవకలు కలెక్టర్ గ్రీవెన్స్ విచారణలో బయటపడటంతో నిందితుడైన వీఓఏపై వేటు పడింది. సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ సమాఖ్యలో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. గానుగబండ గ్రామ సమాఖ్యలో 2022లో స్త్రీ నిధి రుణాలు మంజూరయ్యాయి. సభ్యులు తమ నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా వీఓఏ సైదులుకు చెల్లిస్తున్నారు. అయితే, సైదులు ఆ డబ్బును పూర్తిగా స్త్రీ నిధి ఖాతాలో జమ చేయకుండా సొంతనికి వాడుకున్నారు. సభ్యుల నుంచి ముందస్తు వాయిదాల పేరుతో భారీగా వసూలు చేసి, బ్యాంకు రికార్డుల్లో మాత్రం కనీస మొత్తమే చెల్లిస్తూ మిగతా సొమ్మును స్వాహా చేశాడు. నిబంధనల ప్రకారం వీఓఏలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదని రూల్ ఉన్నప్పటికీ, ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ శివప్రసాద్ ఈ ఏడాది మార్చిలో ఎంక్వయిరీ చేశారు. ఈ విచారణలో వీఓఏ సైదులు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, అతను స్వాహా చేసిన రూ.14,54,000 తిరిగి స్త్రీ నిధి ఖాతాలో రీపేమెంట్ చేయించారు. కేవలం వీఓఏ మాత్రమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఆక్రమలలో సహకరించినట్లు విచారణలో తేలింది. వీఓఏ నిధులు దారి మళ్లిస్తున్నా పట్టించుకోకపోవడం, విచారణ సమయంలో సరిగ్గా స్పందించకపోవడంతో వారిపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వీఓఏ సైదులును తక్షణమే విధుల నుంచి తొలగించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆఫీస్ బేరర్లను కూడా ఆ పదవుల నుంచి తీసేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డిఆర్డిఓ పిడి సన్యాసయ్య ను చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News