Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:11 PM

ఇంటింటా 'గీతా'మృతం!

ఇంటింటా 'గీతా'మృతం!

ఇంటింటా 'గీతా'మృతం!
29-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,000 కుటుంబాలకు ‘భగవద్గీత’ పుస్తకాల పంపిణీ

సంక్లిష్టంగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి.. మహాభారతం, శ్రీమద్భాగవతం సహా 18 మహాపురాణాలను అందించి విశ్వ మానవాళికి వేగుచుక్కగా నిలిచిన వ్యాస భగవానుని జన్మదినమైన 'గురు పూర్ణిమ'ను పురస్కరించుకుని చౌటుప్పల్‌లో ‘ఇంటింటా శ్రీమద్భగవద్గీత’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి కుటుంబాలకు భగవద్గీత పుస్తకాలను 'ప్రసాదం'గా అందించారు. ​ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త బడుగు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మానవ జీవన యానానికి భగవద్గీత ఒక దివ్యమైన దీపస్తంభం లాంటిది. సత్యాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని నిత్య జీవితంలో పాటించాలంటే ప్రతీ ఒక్కరూ రోజువారీగా గీతా పఠనం చేయాలి. ప్రాచీన ఋషులు రూపొందించిన ధర్మమే ఈ విశ్వానికి ఆధారపీఠంగా నిలిచింది అన్నారు. ​ఫౌండేషన్ చైర్మన్ మురళి గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటా 'గీతా'మృతం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News