చిట్యాల పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బుధవారం (జూలై 29) ఉదయం 10 గంటలకు "శ్రీరామ హృదయ కలశ వందనం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళన సమితి ప్రకటించింది.
ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్ల నుంచి బియ్యం తీసుకుని ఆలయానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరామ హృదయ కలశంపై కుంకుమ, పసుపు సమర్పించి, అనంతరం పిడికెడు బియ్యాన్ని కలశంలో వేసి, కలశాన్ని స్పర్శిస్తూ "శ్రీరామ" నామస్మరణతో వందనం సమర్పించాలని సూచించారు.
ఆధ్యాత్మిక చైతన్యం, భక్తి భావాన్ని పెంపొందించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి, చిట్యాల పిలుపునిచ్చింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి