Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:07 PM

అత్యవసరమైతేనే బయటకు రావాలి: ఎస్ఐ దుర్గారెడ్డి

28-07-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్‌ఐ దుర్గారెడ్డి ప్రజలకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, కాలువలు, వాగులు, చెరువులు, కుంటల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే బలహీనంగా ఉన్న లేదా వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను నీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లనివ్వకూడదని సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ దుర్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని, అందరూ అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

Sthanikam

అత్యవసరమైతేనే బయటకు రావాలి: ఎస్ఐ దుర్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News