Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

విధుల నిర్వహణలో బిఎల్వోల సేవలు అభినందనీయం, ఘన సన్మానం : కౌన్సిలర్ తిరుమణి యాదగిరి

28-07-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో బూత్ లెవల్ అధికారులు (బిఎల్వోలు) కీలక పాత్ర పోషిస్తున్నారని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి కొనియాడారు. మున్సిపాలిటీలోని మాలిపురం పరిధిలో గల 308 మరియు 309 పోలింగ్ బూతులలో బిఎల్వోలుగా విధులు నిర్వర్తించిన మద్దూరి ఉమేష్, చింతకాయల పరుశురాములు తమ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి నివాసంలో వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ యాదగిరి మాట్లాడుతూ.. ఎండనక, వాననక ప్రతి ఇంటికీ తిరుగుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బిఎల్వోలు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇలాగే బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు జంపాల భిక్షం, మామిడాల వెంకటేశ్వర్లు, ఈశ్వర చారి, సోమన్న తదితరులు పాల్గొని, విధులను విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్వోలను అభినందించారు.

Sthanikam

విధుల నిర్వహణలో బిఎల్వోల సేవలు అభినందనీయం, ఘన సన్మానం : కౌన్సిలర్ తిరుమణి యాదగిరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News