Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు

27-07-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ జడ్పీహెచ్‌ఎస్

పాఠశాలలో ఘనంగా బహుమతుల ప్రధానోత్సవం

ఏకాగ్రత, క్రమశిక్షణతో విద్యనభ్యసించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని విశ్రాంత మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎం.ఎస్. కృష్ణమూర్తి అన్నారు. చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1978- 79 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 2025- 26 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికం, జ్ఞాపికలతో పురస్కారాలను అందజేశారు. ​పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎం.ఎస్. కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే దేశం పట్ల భక్తి, ధర్మం పట్ల అనురక్తిని పెంపొందించుకోవాలని, గురువులను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ​సిద్ధార్థి పురస్కారం 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన యం. డి. సమ్రీన్, ​శ్రీ విద్యా పురస్కారం ఇంగ్లీషు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఏ. మణి సాయి, యం. డి. ఇర్ఫాన్ బాబా, బడుగు రామస్వామి కమలమ్మ విజ్ఞాన వికాస పురస్కారం 9వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన జి. చరణ్ కుమార్ లకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బడుగు శ్రీరాములు, కళ్లెం అంజిరెడ్డి, చింతల కరుణాకర్ రెడ్డి, కర్నాటి సత్యనారాయణ, బొబ్బిళ్ళ వెంకటేశ్వర కుమార్, అంబటి ప్రమీల, లలిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News