Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 06:42 PM

కోమటిరెడ్డి బ్రదర్స్ కు సామేలు క్షమాపణ చెప్పాలి: వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ​

కోమటిరెడ్డి బ్రదర్స్ కు సామేలు క్షమాపణ చెప్పాలి: వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ​

కోమటిరెడ్డి బ్రదర్స్ కు సామేలు క్షమాపణ చెప్పాలి: వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య  ​
July 27, 2026 04:48 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి బ్రదర్స్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.​అన్ని వర్గాల ఓట్లతో గెలిచిన సామేల్, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దళిత కార్డును వాడుకుంటూ కాంగ్రెస్ లో కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో అసలైన కార్యకర్తలను విస్మరించి, తన కుమారులకే పదవులు, కాంట్రాక్టులు కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. కాసుల కోసం మండల అధ్యక్ష పదవులను అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News