Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:18 PM

నల్లగొండలో బ్యాలెట్ బాక్స్ కలకలం.. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన పెట్టె స్క్రాప్ షాపులో ప్రత్యక్షం

27-07-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ, జూలై 27:

నల్లగొండ పట్టణంలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని శివగంగా ప్రాంతంలో ఉన్న ఓ పాత ఇనుప సామాను దుకాణంలో తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందినట్లు కనిపిస్తున్న బ్యాలెట్ బాక్స్ లభ్యమవడం పలు అనుమానాలకు తావిస్తోంది.సాధారణంగా ఎన్నికల నిర్వహణలో ఉపయోగించే బ్యాలెట్ బాక్సులను ఎన్నికలు పూర్తైన తర్వాత సంబంధిత అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. అలాంటి బ్యాలెట్ బాక్స్ స్క్రాప్ షాపులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.బ్యాలెట్ బాక్స్‌పై ఉన్న వివరాలను పరిశీలిస్తే అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు ఎలా వచ్చింది? ఎన్నికల సంఘం అధికారికంగా వేలం వేసిందా? లేక మరే ఇతర మార్గంలో స్క్రాప్ దుకాణానికి చేరిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు, బాక్స్‌పై కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు కనిపించడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. దుకాణ యజమానిని ప్రశ్నించగా, మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఈ బాక్స్‌ను తమకు విక్రయించినట్లు తెలిపినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఇలాంటి బ్యాలెట్ బాక్సులు మరెక్కడైనా బయటకు వచ్చాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. బ్యాలెట్ బాక్స్ స్క్రాప్ దుకాణానికి చేరిన తీరుపై బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Sthanikam

నల్లగొండలో బ్యాలెట్ బాక్స్ కలకలం.. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన పెట్టె స్క్రాప్ షాపులో ప్రత్యక్షం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News