Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కేకే కమిటీ పేరుతో కాలయాపన వద్దు.

27-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమకారులకు న్యాయం చేయాలి: గంధ మల్ల బాలయ్య.

రామన్నపేట

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధ మల్ల బాలయ్య డిమాండ్ చేశారు.

రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నప్పటికీ, కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలని కోరారు.

ఉద్యమకారుల న్యాయమైన హక్కులను అమలు చేయాలని, ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలం, రూ.25 వేల నెలవారీ పింఛన్, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొన్నవారితో పాటు బైండోవర్ కేసులు ఎదుర్కొన్న ఉద్యమకారులను కూడా గుర్తించి వారికి న్యాయం చేయాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో సాంస్కృతిక విభాగం కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ గంధ మల్ల వెంకటేశం, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకుడు రెబ్బాసు రాములు, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, సీపీఐ మండల మాజీ కార్యదర్శి గంగాపురం యాదయ్య, స్థానికం చీఫ్ ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ , మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్, మద్దెగల్ల నరసింహ, కైరం కొండ సంతోష్, ఎర్ర రమేష్ గౌడ్, పెండం రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కేకే కమిటీ పేరుతో కాలయాపన వద్దు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News