Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:18 AM

ఎస్‌ఐఆర్ ఓటర్ల గణన ఫారాల నమోదుకు శ్రీకారం

14-07-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధికారులకు ఘన స్వాగతం పలికిన కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్

భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డు పిల్లలమర్రిలో ఓటర్ల గణన ఫారాల నమోదుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వార్డులోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, సూర్యాపేట డిప్యూటీ తహసీల్దార్ లాల్ నాయక్‌లకు 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం అధికారుల సమక్షంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన వారు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావడం తన బాధ్యతగా భావించాలని అన్నారు. యువత, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, వార్డులో ఒక్క అర్హుడూ ఓటరు జాబితాకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు, వార్డు నాయకులు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ ఓటర్ల గణన ఫారాల నమోదుకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News