Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:27 AM

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా డా. మద్దిలేటి నియామకం

14-07-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా గణితశాస్త్ర విభాగ అధ్యాపకుడు డా. మద్దిలేటిని నియమిస్తూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో డా. మద్దిలేటి ఒక సంవత్సరం పాటు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, అంతర్విశ్వవిద్యాలయ పోటీలకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

డా. మద్దిలేటి గతంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా, గణితశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించి విశిష్ట పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు. విద్యా, పరిపాలనా రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన విశ్వవిద్యాలయ యాజమాన్యం స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా నియమించింది.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం కల్పించడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన డా. మద్దిలేటి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ క్రీడా విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వివిధ స్థాయిల పోటీల్లో ఎంజీయూ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

డా. మద్దిలేటి నియామకాన్ని విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవితో పాటు పలువురు అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతల్లో డా. మద్దిలేటి విశ్వవిద్యాలయ క్రీడారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తారనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు.

Sthanikam

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా డా. మద్దిలేటి నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News