Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

14-07-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

Article Image

చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News