Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి – వీరమళ్ళ కార్తీక్ గౌడ్

Updated : 13 Jul 2026 18:02 IST
As Preferred Source 1 min read
బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి – వీరమళ్ళ కార్తీక్ గౌడ్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీసీ యువజన సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.​ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక బీసీ మహిళను, యాదవ బిడ్డను అవమానించేలా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నారు. శివచరణ్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ జాతికి, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా సహించే ప్రసక్తే లేదు. ​వెంటనే క్షమాపణ చెప్పని పక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అవసరమైతే జక్కిడి శివచరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

​ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, నియోజకవర్గ నాయకుడు కట్కురి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కొల్లూరు నవీన్, నాయకులు కిషోర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news