Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:38 PM

శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్‌ఐ సతీష్ గౌపతి

13-07-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు.

ప్రజలకు అందుబాటులో పారదర్శక పోలీసింగ్‌.

రామన్నపేట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై రాజీలేని చర్యలు ఉంటాయని రామన్నపేట ఎస్‌ఐ సతీష్ గౌపతి స్పష్టం చేశారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పోలీసింగ్‌ను అమలు చేస్తామని తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, నేరాలకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలను నమ్మవద్దని సూచించారు. మోసాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎస్‌ఐ, ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రశాంత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం.ఎస్‌ఐ సతీష్ గౌపతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News