Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!

పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!

పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!
13-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వృద్ధురాలిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. కేసు నమోదు కాలేదంటూ కుమారుడి ఆవేదన.

పెన్షన్ తీసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా, ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మంతెన అనసూయ అనే వృద్ధురాలు వారం రోజుల క్రితం పెన్షన్ పనిమీద బస్టాండ్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నల్గొండ గొల్లగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాధితురాలి కుమారుడు మంతెన శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేయాలంటే ప్రమాదానికి కారణమైన కారు నంబర్ తీసుకురావాలని పోలీసులు చెబుతున్నారని, ప్రమాద సమయంలో అక్కడ లేని తనకు వాహనం నంబర్ ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు.

తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రమాద ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందిత వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News