Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:39 PM

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం

12-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గం ఆదివారం సంఘ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముషం రవి, వైస్ చైర్మన్ రమేష్ ఈశ్వరయ్య, కార్యదర్శి రమేష్ బక్కయ్య, కోశాధికారి శేషమ్మ, సభ్యులు రమేష్ తదితరులు తమ పదవుల బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు ప్రతి చేనేత కార్మికుడికి సకాలంలో అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్, గంజి పండరి, సీహెచ్ కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చర్లపల్లి చేనేత సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News