Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:44 PM

ఎలక్ట్రిషన్లకు లైసెన్సులు తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఆర్‌–1, డబ్ల్యూఆర్‌–2 విధానం అమలు చేయాలని విజ్ఞప్తి.

12-07-2026 660 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యుత్ శాస్త్రవేత్త నికోలా టెస్లా జయంతి ఆదివారం రామంతాపూర్‌లోని కమిటీ హాల్‌లో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి మాట్లాడుతూ, ప్రతి ఎలక్ట్రిషన్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్‌మన్ పర్మిట్‌తో పాటు సూపర్‌వైజర్ పర్మిట్ కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే అమలులో ఉన్న ఆర్‌ఆర్‌–1, డబ్ల్యూఆర్‌–2 విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం అమలైతే విద్యుత్ ప్రమాదాలు తగ్గి, పనుల్లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ నిర్వాహకుడు కొండ బాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రిషన్ల సంఘాలు జేఏసీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వృత్తిపరమైన సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే జేఏసీ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో నేమాల బెనర్జీ, వై. వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్, ఉదయ్ భాస్కర్, సామల శ్రీకాంత్ రెడ్డి, బడే యాదగిరి, వి. సత్యనారాయణ, కాశీ నాయుడు, మాకం శ్రీనివాస్, నాగేశ్వరరావు, గురుస్వామి, వెంకటేష్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎలక్ట్రిషన్లకు లైసెన్సులు తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ఆర్‌–1, డబ్ల్యూఆర్‌–2 విధానం అమలు చేయాలని విజ్ఞప్తి.

Article Image

తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యుత్ శాస్త్రవేత్త నికోలా టెస్లా జయంతి ఆదివారం రామంతాపూర్‌లోని కమిటీ హాల్‌లో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి మాట్లాడుతూ, ప్రతి ఎలక్ట్రిషన్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్‌మన్ పర్మిట్‌తో పాటు సూపర్‌వైజర్ పర్మిట్ కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే అమలులో ఉన్న ఆర్‌ఆర్‌–1, డబ్ల్యూఆర్‌–2 విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం అమలైతే విద్యుత్ ప్రమాదాలు తగ్గి, పనుల్లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ నిర్వాహకుడు కొండ బాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రిషన్ల సంఘాలు జేఏసీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వృత్తిపరమైన సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే జేఏసీ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో నేమాల బెనర్జీ, వై. వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్, ఉదయ్ భాస్కర్, సామల శ్రీకాంత్ రెడ్డి, బడే యాదగిరి, వి. సత్యనారాయణ, కాశీ నాయుడు, మాకం శ్రీనివాస్, నాగేశ్వరరావు, గురుస్వామి, వెంకటేష్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News