Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

పేదల సొంతింటి కల.. కాంగ్రెస్‌తోనే సాధ్యం

12-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతోనే ఇళ్ల మంజూరు

నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. ధర్మోజిగూడెం గ్రామంలో ఊదరి సుశీల - గోపాల్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సొంత ఇంటి కల, కలగానే మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, లబ్ధిదారులు సుశీల - గోపాల్ దంపతులు ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదల పక్షపాతి అని కొనియాడారు. గ్రామంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తమకు ఇల్లు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ గృహప్రవేశ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రాచకొండ వెంకటేశం, చెన్నోజు విజయ్ చారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊదరి నర్సింహ, ఊదరి స్వామి, ఊదరి రవి, ఐతరాజు శ్రీకాంత్, వల్లబోతు నరేష్, కొంతం మధు, జంగం సందీప్, వల్లబోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల సొంతింటి కల.. కాంగ్రెస్‌తోనే సాధ్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News