Sthanikam - Truth Matters
Logo

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

Updated : 12 Jul 2026 12:58 IST
As Preferred Source 1 min read
చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

రూ.339 కోట్ల హ్యామ్ ప్రాజెక్ట్ పనులకు ఘనంగా శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో చిట్యాల–భువనగిరి హ్యామ్ రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రూ.339 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్యాల–భువనగిరి మార్గం జిల్లాలో కీలక రహదారిగా మారిందని, రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుతం పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు రవాణా సమయం తగ్గి ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news