Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

వెళ్లంకిలో ఉపేందర్ ప్యానెల్‌కు చేనేత కార్మికుల పట్టం. 9 స్థానాల్లో 7 స్థానాల కైవసం • 95 శాతం పోలింగ్ • నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

11-07-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెళ్లంకి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో మిర్యాల ఉపేందర్ ప్యానెల్ ఆధిపత్యం చాటుకుంది. మొత్తం తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉపేందర్ ప్యానెల్‌కు చెందిన ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 680 మంది ఓటర్లలో సుమారు 95 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

విజయం సాధించిన అభ్యర్థులు కొంగరి జానయ్య, రుద్ర వెంకటేష్, గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావిటి రమేష్, వనం శ్యామలి, వనం లలిత శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం గ్రామ సర్పంచ్ ఇడేం రాధా శ్రీనివాస్ నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా చేనేత సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కార్యవర్గం పనిచేయాలని సూచించారు.

చైర్మన్ అభ్యర్థి మిర్యాల ఉపేందర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన చేనేత కార్మికులు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి విశ్వాసానికి అనుగుణంగా సంఘ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు గంజి భాస్కర్, మిర్యాల జగన్, మాజీ సర్పంచ్ పున్న నర్సింహా, చేనేత సంఘ మాజీ అధ్యక్షుడు వనం పురుషోత్తం, శ్రీ భావన ఋషి పద్మశాలి సంఘం అధ్యక్షుడు పున్న రమేష్, ప్రధాన కార్యదర్శి రావిటి సతీష్, చేనేత సంఘ నాయకులు, కార్మికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

వెళ్లంకిలో ఉపేందర్ ప్యానెల్‌కు చేనేత కార్మికుల పట్టం. 9 స్థానాల్లో 7 స్థానాల కైవసం • 95 శాతం పోలింగ్ • నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెళ్లంకి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో మిర్యాల ఉపేందర్ ప్యానెల్ ఆధిపత్యం చాటుకుంది. మొత్తం తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉపేందర్ ప్యానెల్‌కు చెందిన ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 680 మంది ఓటర్లలో సుమారు 95 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

విజయం సాధించిన అభ్యర్థులు కొంగరి జానయ్య, రుద్ర వెంకటేష్, గంజి లక్ష్మయ్య, ఐటీ పాముల శ్రీవేందర్, తాటి రాములు, రావిటి రమేష్, వనం శ్యామలి, వనం లలిత శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం గ్రామ సర్పంచ్ ఇడేం రాధా శ్రీనివాస్ నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా చేనేత సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కార్యవర్గం పనిచేయాలని సూచించారు.

చైర్మన్ అభ్యర్థి మిర్యాల ఉపేందర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన చేనేత కార్మికులు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి విశ్వాసానికి అనుగుణంగా సంఘ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు గంజి భాస్కర్, మిర్యాల జగన్, మాజీ సర్పంచ్ పున్న నర్సింహా, చేనేత సంఘ మాజీ అధ్యక్షుడు వనం పురుషోత్తం, శ్రీ భావన ఋషి పద్మశాలి సంఘం అధ్యక్షుడు పున్న రమేష్, ప్రధాన కార్యదర్శి రావిటి సతీష్, చేనేత సంఘ నాయకులు, కార్మికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News